Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీలో ఆప్ ఎంపీల అధికారిక విలీనం కంప్లీట్

కలం, వెబ్ డెస్క్ : బీజేపీ (BJP)లో రాఘవ్ చడ్డా నాయకత్వంలోని ఆప్ ఎంపీల చేరిక అధికారికంగా పూర్తి అయింది. ఈ మేరకు ఆప్ ఎంపీలు రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీలో చేరడాన్ని రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆ తర్వాత వారందరిని బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం 106 నుంచి 113కు చేరుకుంది. దీంతో కీలక బిల్లుల ఆమోద సమయంలో ఎన్డీయే కూటమికి లాభం చేకూరనుంది. మరోవైపు రాజ్యసభలో ఆప్ బలం 3కు పడిపోయింది. కాగా, ఆప్ ఎంపీల విలీనంలో కీలకంగా వ్యవహరించిన రాఘవ్ చడ్డా కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>