Mobile Popup Ad
Mobile Popup Ad

నాన్ వెజ్ కోసం గొడవ.. భర్తను హతమార్చిన భార్య!

కలం, వెబ్‌డెస్క్: నాన్ వెజ్ వండలేదని అడిగినందుకు భార్య భర్తను చంపిన దారుణ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గోసంగి కాలనీలో శివాజి, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2017 వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే శనివారం రాత్రి శివాజీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం నాన్ వెజ్ ఎందుకు వండ లేదని భార్యపై కోప్పడ్డారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర కోపానికి గురైన భార్య లక్ష్మి శివాజీ పైకి కొడవలిని విసిరింది. కొడవలి మెడ భాగానికి తగలడంతో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో 15 నిమిషాల్లోనే శివాజీ మృతిచెందాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>