కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram), మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)ల ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు పూర్తయ్యింది. శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం ఆదివారం వీరి ప్రమాణానికి గెజిట్ విడుదల చేసింది. ఇక ఈ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన కోదండరామ్, అజారుద్దీన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను క్రికెట్‌లో కెప్టెన్ అని, ఇక తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తమ కెప్టెన్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

