కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్ ఇంకా తమ A+ స్థాయి ఆట చూపలేదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డారు. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచినా జట్టు పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదని ఆయన పేర్కొన్నారు. టీమిండియా గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సూపర్-8కు చేరుకుంది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై విజయాలు సాధించింది. ప్రతి మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్ చేసింది.
అయితే ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ కష్టాల్లో పడిందని చోప్రా (Aakash Chopra) గుర్తు చేశారు. అమెరికాపై మ్యాచ్‌లో 77/6కు కుదేలైన పరిస్థితి ఎదురైందని తెలిపారు. నెదర్లాండ్స్‌పై కూడా 69/3 వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. పాకిస్థాన్‌పై మంచి ఆరంభం వచ్చినా మధ్యలో వికెట్లు కోల్పోయిందని వివరించారు. నమీబియాపై గెలిచినా చివరి ఓవర్లలో పరుగులు రాలేదని గుర్తుచేశారు. టోర్నీ ఆరంభంలో జట్టులో కొంత అహంకారం కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి బంతిని సిక్స్ కొట్టాలనే ధోరణి కనిపించిందని తెలిపారు.
అదే జట్టుకు రియాలిటీ చెక్ ఇచ్చిందని చెప్పారు. అమెరికాపై మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 84 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారని గుర్తుచేశారు. ఆ మ్యాచ్ తర్వాత జట్టు మరింత జాగ్రత్తగా ఆడడం ప్రారంభించిందని చోప్రా అభిప్రాయపడ్డారు. గ్రూప్ దశ విజయాలతో ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ, సూపర్-8లో అసలైన పరీక్ష ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: వరల్డ్ క్రికెట్‌ను డామినేట్ చేయడమే లక్ష్యం: స్మృతి మంధాన
Follow Us On: X(Twitter)


