కలం, స్పోర్ట్స్: భారత్–దక్షిణాఫ్రికా (IND vs SA) సూపర్ 8 పోరులో స్పిన్నర్లే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అక్సర్ పటేల్ (Axar Patel), కేశవ్ మహారాజ్ పాత్ర కీలకంగా మారనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఇద్దరూ అనుభవాన్ని చూపించాలని జట్లు ఆశిస్తున్నాయి. అక్సర్ ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని సగటు 12.17 కాగా ఎకానమీ 6.64గా ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చారు.
మరోవైపు కేశవ్ మహారాజ్ (Keshav Maharaj).. కెనడాపై వికెట్ దక్కకపోయినా, ఆఫ్ఘానిస్తాన్ మరియు న్యూజిలాండ్‌పై తలో వికెట్ తీశాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌గా జట్టుకు కీలకంగా మారనున్నాడు. 46 టీ20 మ్యాచ్‌ల తర్వాత గణాంకాలు చూస్తే అక్షర్ 39 వికెట్లు తీసి 27.02 సగటు నమోదు చేశాడు. అదే సమయంలో మహారాజ్ 45 వికెట్లు తీసి 26.44 సగటు సాధించాడు. ఎకానమీ పరంగా ఇద్దరూ దాదాపు సమానంగా నిలిచారు. అక్షర్ ఎకానమీ 7.57 కాగా మహారాజ్ ఎకానమీ 7.58గా ఉంది.
నాలుగు వికెట్ల ప్రదర్శన మాత్రం ఇద్దరికీ లేదు. అక్షర్ ఉత్తమ ప్రదర్శన 3 వికెట్లే కాగా మహారాజ్ కూడా 3 వికెట్లకే పరిమితమయ్యాడు. జట్టు గెలిచిన మ్యాచ్‌ల్లో అక్షర్ 30 వికెట్లు తీసి 7.35 ఎకానమీ నమోదు చేశాడు. అదే సమయంలో మహారాజ్ 29 వికెట్లు తీసి 6.89 ఎకానమీతో మెరుగ్గా నిలిచాడు. మొత్తంగా చూస్తే అక్షర్, మహారాజ్ మధ్య స్పిన్ పోరు మ్యాచ్‌లో కీలకంగా మారే అవకాశముంది. రెండు జట్లూ (IND vs SA) ఈ మ్యాచ్‌ను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.
Read Also: భారత్ ఇంకా తన A+ ఆట ఆడలేదు: ఆకాష్
Follow Us On : WhatsApp


