epaper
Tuesday, November 18, 2025
epaper

పసిడి పంచ్ విసిరిన అంకుషిత, అరుంధతి

BFI Cup 2025 | బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్‌లో అంకుషిత బొరో, అరుంధతి చౌదరి అదరగొట్టారు. ఇద్దరూ స్వర్ణ పతకాలు సాధించి మెరిశారు. మహిళల 60-65 కేజీల ఫైనల్లో అంకుషిత(అసోం).. పార్థవి గ్రెవాల్‌(రాజస్థాన్)ను 3-2 తేడాతో ఓడించింది. 65-70 కేజీల ఫైనల్స్‌లో అరుంధతి(సర్వీసెస్) 5-0 స్నేహా (ఏఐపీ)ని మట్టికరిపించింది. 45-48 కేజీల్లో నివేదిత (ఉత్తరాఖండ్‌),, మంజు రాణి (రైల్వేస్‌)పై 3-2తో విజయం సాధించింది. 48-51 కేజీల్లో భావన శర్మ 5-0తో సవిత (రైల్వేస్‌)పై ఆధిపత్యం సాధించింది.

BFI Cup 2025 | పురుషుల 55-60 కేజీల్లో తెలంగాణ కుర్రాడు మహ్మద్‌ హుసాముద్దీన్‌ టైటిల్‌ ముంగిట నిలిచాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు సెమీస్‌లో మితేశ్‌ దేశ్వాల్‌ (రైల్వేస్‌)ను 5-0తో ఓడించాడు. 47-50 కేజీల్లో విశ్వనాథ్‌ (సర్వీసెస్‌) అంతే తేడాతో గోపి మిశ్రా (సర్వీసెస్‌)ను చిత్తు చేశాడు. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అమిత్‌ ఫంగాల్‌కు మాత్రం చుక్కెదురైంది. ఈ సర్వీసెస్‌ బాక్సర్‌ సహచర సర్వీసెస్‌ ఆటగాడు ఆశిష్‌ చేతిలో 1-4తో ఓటమిని చవిచూశాడు.

Read Also: రష్మిక స్పీడుకు రుక్మిణి బ్రేకులు వేస్తోందా..?
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>