నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2 (Akhanda 2) ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి కుంభమేళా సీన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో టీమ్ ఎంత కష్టపడిందో చూపించారు. గంగా నదిలో సీన్లతో పాటు అఘోరాలను హైలెట్ చేస్తూ తీసిన సీన్లు చాలానే ఆకట్టుకుంటున్నాయి. నిజమైన కుంభమేళా అనిపించేలా అఘోరాల గెటప్స్ కూడా బాగానే డిజైన్ చేయించారు బోయపాటి శ్రీను. డిసెంబర్ 12న వచ్చిన అఖండ 2 (Akhanda 2) హిట్ టాక్ తెచ్చుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య ఇందులో పూర్తి స్థాయిలో కనిపించారు. చైనా, భారత్ మధ్య బయోవార్ తో పాటు ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, అఘోరాల తీరును ఇందులో చూపించాడు బోయపాటి. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.


