తమిళనాడు బీజేపీకి షాక్: అన్నామలై బాటలో కీలక నేతల రాజీనామాలు!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు భారతీయ జనతా పార్టీ (Tamil Nadu BJP)లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపంలోకి చేరింది. రాష్ట్ర అగ్రనేత అన్నామలై బాటలోనే నడుస్తూ పలువురు రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ పరిణామాల్లో భాగంగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నామలై ప్రారంభించిన నూతన ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నాగరాజన్ సరసన మరికొందరు ముఖ్య నేతలు కూడా చేరడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

రాష్ట్ర ఉపాధ్యక్షుడితో పాటు పార్టీ (Tamil Nadu BJP) కార్యదర్శి సుమతి వెంకటేష్, యువ మోర్చా రాష్ట్ర లీగల్ కన్వీనర్ అభిలాష్ గోపీనాథ్ సైతం తమ పదవులను త్యజించి బీజేపీకి టాటా చెప్పారు. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా రాజీనామా బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీలో ఈ స్థాయి అసంతృప్తి వెళ్లడవుతుంటే, మరోవైపు అన్నామలై (Annamalai) ప్రారంభించిన సరికొత్త ప్రస్థానానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. అన్నామలై తాజాగా ప్రారంభించిన ‘వి ద లీడర్స్ పోర్టల్’ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన కేవలం పది గంటల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల మంది వాలంటీర్లుగా నమోదు చేసుకోవడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. నేతల రాజీనామాలు, భారీ వ్యూహాత్మక మార్పులతో తమిళనాడు రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.

Read Also: నేడు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన: ఢిల్లీలో హై అలర్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>