కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రేపటి నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను విచారించనున్నది. ఈ సందర్భంగా శుక్రవారం సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో తొలి సమావేశం నిర్వహించారు. సిట్ లో ఉన్న తొమ్మిది మంది అధికారులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) సమావేశమయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో ప్రభాకర్ రావును విచారించాల్సిన అంశాలపై చర్చించారు. మొదటి వారం రోజులు ప్రభాకర్ రావు కస్టడీలో ఉండగా, జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. రేపటి నుంచి ప్రభాకర్ రావు ను ప్రత్యేక సిట్ బృందం విచారించనున్నది. డిజిటల్ ఎవిడెన్స్, సాంకేతిక పరికరాలు, సంబంధిత డేటా సేకరణపై ప్రధాన దృష్టి సారించాలని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Read Also: అనూష హత్యోదంతం… అసలు రాష్ట్రంలో డౌరీ మరణాలెన్నో తెలుసా?
Follow Us On: Youtube


