epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రష్మిక స్పీడుకు రుక్మిణి బ్రేకులు వేస్తోందా..?

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) స్పీడ్ మామూలుగా లేదు. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. అయితే తాజా పరిణామాలను చూస్తే మాత్రం రష్మిక స్పీడుకు బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ బ్రేకుల పేరే ‘రుక్మిణి(Rukmini Vasanth)’. పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన రష్మికకు మరో కన్నడ బ్యూటీ ‘రుక్మిణి’ ఛాలెంజ్‌గా మారింది. మొన్నటి వరకు వరుస అవకాశాలు అందుకున్న రష్మికకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయన్న టాక్ సినీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది. రష్మిక స్థానంలో ‘రుక్మిణి వసంత్‌’ను ఎంపిక చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారట. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో రుక్మిణి దిట్ట. తాజాగా వచ్చిన కాంతారా-1లో కూడా ఆమె అద్భుత నటన కనబరిచారు. ఆ మూవీతో ఆమెకు భారీ బ్రేక్ వచ్చింది. కాంతారా-1తో నేషనల్ వైడ్‌గా ‘రుక్మిణీ’కి గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో చాలా అవకాశాలు రష్మికకు వెళ్లాల్సినవని, కానీ ఇప్పుడు రేసులోకి రుక్మిణి ఎంట్రీతో అంతా మారిపోతోందని కొందరు క్రిటిక్స్ అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్ చేస్తున్న ‘డ్రాగన్’ మూవీలో రుక్మిణి నటిస్తున్నారు. దాంతో పాటు రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వస్తుందట. ఒక్కసారి థియేటర్లలోకి ‘డ్రాగన్’ ఎంట్రీ ఇస్తే ఇక రుక్మిణి(Rukmini Vasanth)ని ఆపడం ఎవరి వల్లా కాదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రష్మి పెళ్లికి రెడీ అయిపోవడంతో అమ్మడికి కాస్తంత గ్యాప్ ఇద్దామనుకున్న మేకర్స్ అందరికీ కూడా రుక్మిణి ప్రత్యామ్నాయంగా మారిందన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Read Also: మిథాలి రాజ్‌కు అరుదైన గౌరవం..
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>