కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పాక్స్ (PACS) చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు జిల్లా కేంద్ర సహకాల బ్యాంకుల (DCCB) పాలకవర్గాలను రద్దు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 14 వ తేదీతో పదవీకాలం ముగియడంతో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆ బాధ్యతలతో అవి కొనసాగే అవకాశమున్నది. కానీ హఠాత్తుగా ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు PACS (ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాలు) లను ఏర్పాటు చేశాయి. వీటి నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలకవర్గాలు నియామకవుతాయి.
సహకార సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 2020లో ఎన్నికలు జరిగాయి. వీటి పదవీకాలం ఈ సంవత్సరం ఫిబ్రవరితో ముగియగా 6 నెలల పాటు పెంచింది. ఆ పదవీకాలం ముగియక ముందే శుక్రవారం పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఉత్తర్వులను జారీ చేయడం గమనార్హం.
Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: Pinterest


