మాజీ మావోయిస్ట్ తిరుపతిని పరామర్శించిన కవిత

కలం, వెబ్ డెస్క్: మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్ జీ‌ని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స గురించి డాక్టర్లను వివరాలు అడిగారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కాగా, మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దేవ్ జీ మళ్లీ చదువు బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు రాసిన ఆయన, లా సెట్‌లో కూడా ర్యాంకు సాధించారు. తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>