Mobile Popup Ad
Mobile Popup Ad

కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి పవన్ కళ్యాణ్ హామీ

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు, చెక్క వాచ్, ల్యాప్ టాప్ వంటి వంట ఇంటి సామాగ్రిని శ్రద్దగా తిలకించారు.చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిమను తయారు చేయించాలని కొయ్య బొమ్మల కళాకారులను పవన్ కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకు ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు,మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు చేరవేసే విధానాన్ని ఆయన వీక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>