కలం, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్స్ ద్వారా మనీలాండరింగ్ జరిగిందని నమోదైన కేసులో క్రికెటర్లు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), రాబిన్ ఉతప్ప, అంకుష్ హజ్రా, యాక్టర్లు సోనూసూద్(Sonu Sood), ఊర్వశి రౌతేలా, నేహా శర్మ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీరంతా ఉద్దేశ్యపూర్వకంగానే 1బెట్ యాప్‌తో లావాదేవీలు జరిపారని గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకుంది.
కాగా, మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.7.93కోట్లు. ఇందులో యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కు సంబంధించి రూ.2.5కోట్లు, ఉతప్ప–8.26లక్షలు, ఊర్వశి రౌతేలా(తల్లి పేరు మీద) –రూ.2.02కోట్లు, సోనూసూద్–రూ.1కోటి, మిమి చక్రవర్తి –రూ.59లక్షలు, అంకుష్ హజ్రా రూ.47.20లక్షలు, నేహా శర్మకు సంబంధించి రూ.1.26కోట్లు ఉన్నాయి. ఇదే కేసులో ఇంతకుముందు క్రికెటర్లు సురేశ్ రైనా నుంచి రూ.4.55కోట్లు, శిఖర్ ధవన్ నుంచి రూ.6.64కోట్లు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.19.07కోట్లకు చేరింది.
Read Also: ఒక్క ఊరు.. కానీ మూడు జిల్లాలు
Follow Us On: Youtube


