2029 నాటికి ‘అందరికీ గృహవసతి’.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : 2029 మార్చి నాటికి భారత్ లోని ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 12 రాష్ట్రాలకు రూ. 10,021.42 కోట్లను మంజూరు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు నిధుల విడుదలకు కేంద్రం మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>