కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) కేరళ తరహాలో హౌస్‌బోట్లను ప్రారంభించనుంది. త్వరలో విజయవాడలోని కృష్ణా నదిపై లగ్జరీ హౌస్ బోట్లు అందబాటులోకి రానున్నాయి. ప్రశాంతమైన అనుభవాన్ని కోరుకునే టూరిస్టులను హౌస్‌బోట్లు ఆకర్షించనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏపీ పర్యాటక శాఖ ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఈ హౌస్‌బోట్ల (Houseboats)ను కేరళ తరహాలో రూపొందించారు. ఆధునిక సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకోకున్నాయి. కేరళకు వెళ్లేబదులు స్థానికంగా మంచి థ్రిల్‌ను అందించబోతున్నాయి. ప్రతి హౌస్‌బోట్‌లో బెడ్‌రూమ్‌లు, ఎయిర్ కండిషనర్లు, అటాచ్డ్ బాత్రూమ్‌లు, భోజన స్థలం, సరైన సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే లైఫ్ జాకెట్లు, శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు. టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. మొదటి దశలో దాదాపు 20 హౌస్‌బోట్‌లను ప్లాన్ చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కనక దుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజ్ లాంటి ఆకర్షణలతోపాటు ఈ హౌస్‌బోట్లు త్వరలో విజయవాడలో మరో ప్రధాన ఆకర్షణ కానుంది.


