ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులు (Telangana Formation Day) ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఉత్సవాలను అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట (Siddipet) జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

అదే విధంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) జాతీయ జెండా ఆవిష్కరించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంఛార్జ్ మంత్రి వివేక్ (Vivek) జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, వారి త్యాగాలను ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>