Mobile Popup Ad
Mobile Popup Ad

పేరుకే రెండు రాష్ట్రాలు.. తెలుగు జాతి ఒక్కటే: చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పేరుకే రెండు రాష్ట్రాలని.. తెలుగు జాతి ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రాంతాలుగా రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినా, తెలుగు జాతీ అంతా ఎప్పటికీ ఒక్కటేనని చెప్పారు.

అభివృద్ధిలో ఇరు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలన్న సీఎం చంద్రబాబు.. వికసిత్ భారత్ 2047లో తెలుగు రాష్ట్రాలు కలసి పనిచేసి, కీలక భూమిక పోషించాలని చెప్పారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు, అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలని కోరుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఏపీ సీఎం చేసిన తాజా ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>