బెంగళూరులో వీఐపీ మూమెంట్ కలకలం.. వ్యక్తి నిరసన వైరల్

కలం, వెబ్ డెస్క్ :  బెంగళూరులోని (Bengaluru) ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో గవర్నర్ కాన్వాయ్ (Governor Convoy) కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటనపై ఓ వ్యక్తి ఆగ్రహంతో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు. గర్భిణీ భార్యతో కలిసి ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి, దీర్ఘకాలంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.

కారు లోపల భార్య ఉండగానే, ఆ వ్యక్తి వాహనం నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీఐపీ కాన్వాయ్‌ల కారణంగా సాధారణ ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై మరోసారి చర్చకు దారితీసింది. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు TGPSC నుంచి 3 నోటిఫికేషన్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>