గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : ఆర్సీబీతో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. మ్యాచ్ అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు బస్సులో  ఆకస్మాత్తుగా మంటలు (Gujarat Titans Bus Fire) చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సహా ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.

ఈ అగ్నిప్రమాదం కారణంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారి కోసం ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ 2026 ట్రోఫీని చేజార్చుకున్నారు.

Read Also: ఫోన్ స్పీడ్ తగ్గిందా? యాప్స్ డిలీట్ చేయకుండా ఇలా బూస్ట్ చేయండి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>