నేడు తునిలో సీఎం చంద్రబాబు పర్యటన

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక, ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పింఛన్ల పంపిణీ, క్యాడర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10:50 గంటలకు చామవరం చేరుకుని ‘ప్రజా వేదిక’లో పాల్గొంటారు. కాగా, ప్రతి నెలా ఏదో ఒక గ్రామంలో పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చామవరం గ్రామంలో మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తుని టీడీపీ శ్రేణులతో సమావేశమై సాయంత్రం 5:15 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. తునిలో సీఎం చంద్రబాబు పర్యటనతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అధినేత రాకతో తుని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Read Also: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>