కలం, వెబ్ డెస్క్: లివ్-ఇన్ రిలేషన్ షిప్‌కు సంబంధించిన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు(Allahabad HC) సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమకు రక్షణ కల్పించాలని 12 జంటలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ జంటలకు తక్షణం రక్షణ కల్పించాలని అలహాబాద్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. లివ్-ఇన్ రిలేషన్‌లో (Live in relationship) ఉన్న జంటలకు వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల ఉంటాయని.. వారికి సమాజం నుంచి, రక్షణ కల్పించాలని న్యాయమూర్తి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
తాము తమ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులకు లోనవుతున్నామని పోలీసులను రక్షణ కోరినా పట్టించుకోవడం లేదని 12 జంటలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
“ఇటీవల ఇలాంటి పిటిషన్లు ఎక్కువగా వస్తున్నాయి. జంటలు జిల్లా పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
పెళ్లి చేసుకోకపోతే రాజ్యాంగం కల్పించిన హక్కులు కోల్పోతారా? అంటూ కోర్టు ప్రశ్నించింది. చిన్నపిల్లలయినా, పెద్దవాళ్లైనా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా వారికి హక్కులు ఉంటాయని కోర్టు పేర్కొన్నది. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ను సమాజం అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్న కాదు. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు అందరికీ ఒకేలా వర్తించాలని కోర్టు తెలిపింది.
దేశంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ కల్చర్ పెరుగుతోంది. కొందరు సంప్రదాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే కోర్టు మాత్రం వారికి రాజ్యాంగపరంగా హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. దేశంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న జంటలకు కోర్టు(Allahabad HC) ఆదేశాలు ఊరట అని చెప్పొచ్చు.
Read Also: ఆయనతో మళ్లీ మూవీ చేస్తా.. రామ్ చరణ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)


