కలం, వెబ్ డెస్క్: మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోయారు. శుక్రవారం మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP) సమక్షంలో లొంగిపోతున్నట్టు తెలుస్తోంది.
Telangana DGP సమక్షంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, పాక హన్మంతు, పసునూరి నరహరి లొంగిపోనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం దాదాపుగా 40 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారే అగ్రనేతలుగా ఉన్నారు. పాటు ఇటు తెలంగాణలోనూ ఈ మధ్యకాలంలో పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. నవంబర్ నెలాఖరులో.. ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Read Also: పబ్‌లు, ఫామ్‌హౌస్‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Follow Us On: X(Twitter)


