కలం, వెబ్ డెస్క్: పాకిస్తాన్ నటీనటులు బాలీవుడ్ దిగ్గజాల పట్ల తమ అభిమానం చాటుకోవడం తెలిసిందే. షారుఖ్ ఖాన్ నుంచి రేఖ వరకు ఎంతోమందిపై ప్రశంసలు కురిపించారు. ఈ జాబితాలోకి మరో పాకిస్తాన్ నటి చేరింది. సల్మాన్‌కు (Salman Khan) ఇండియాలోనే కాకుండా విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న స్టార్లలో సల్మాన్ ఒకరు. అందుకే పాక్ నటి సజల్ అలీ సల్మాన్‌పై మనసు పారేసుకుంది. సజల్ అలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సల్మాన్ ఖాన్ అభిమానులు రూపొందించిన వీడియో రీల్‌ను షేర్ చేసింది. ఆమె దానికి “మై హార్ట్” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించి వైరల్‌గా మారింది. ఇద్దరు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
సజల్ అలీ (Sajal Aly) 2017లో జూలై 7, 2017న మామ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దివంగత దిగ్గజ నటి శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేసింది. సజల్ చివరిసారిగా హిట్ డ్రామా సీరియల్ మై మాంటో నహీ హూన్ లో కనిపించింది. ఆమె 2025లో దిల్ వాలీ గలీ మెయిన్‌లో కూడా నటించింది. 2026లో సజల్ అలీ జంజీరీన్ అనే కొత్త ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. ఇది హమ్ టీవీలో ప్రసారంకానుంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ మాదిరిగా ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది.
Read Also: చైతూ నెక్ట్స్ ఏంటి..?
Follow Us On : WhatsApp


