కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం హోదా కల్పించే గ్రీన్ కార్డు నిబంధనల (Green Card Rules) విషయంలో ట్రంప్ సర్కార్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను వలసదారులు తమ స్వదేశంలో చేసుకోవాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. అయితే పాత విధానం ప్రకారం అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS)తాజాగా ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
ఈ మేరకు గ్రీన్ కార్డు కోసం వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నప్పుడు కూడా వారు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు భారీ ఊరట లభించనుంది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
Read Also: ఉద్యమకారుల గుర్తింపునకు జూన్ 4న అఖిలపక్ష సమావేశం
Follow Us On : WhatsApp

