బాలయ్య కూతురు క్రేజీ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

కలం, వెబ్‌ డెస్క్‌ : నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) తాజాగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గతంలో ఒక జువెలరీ బ్రాండ్ యాడ్‌లో మెరిసిన ఆమె, ఇప్పుడు నృత్యంతోనూ ఆకట్టుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒకవేళ తేజస్విని సినిమాల్లోకి వస్తే తండ్రి బాలయ్య పేరును నిలబెడుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణలో ఉన్న డ్యాన్స్ ఎనర్జీ కూతురిలో (Tejaswini Nandamuri) కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నందమూరి అభిమాన వర్గాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీసింది.

Read Also: డిన్నర్ తర్వాత పండ్లు తినడం మంచిదేనా? నిపుణుల హెచ్చరిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>