పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. కేంద్రం అలర్ట్ జారీ

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ వార్ మొదలై మూడు నెలలు పూర్తైంది. అయినా సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచదేశాలతో పాటు భారత్ లో కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం అలర్ట్ సైరన్ (LPG Stock Alert) మోగించింది.

ఈ మేరకు ఎల్పీజీ నిల్వలపై ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు అందాయి. కనీసం 30 రోజుల నిల్వలు అందుబాటులో ఉంచుకునేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పెట్రోలియం శాఖ ఆదేశాలు (LPG Stock Alert) జారీ చేసింది. పశ్చిమాసియాలో 3 నెలల ఉద్రిక్తతల తర్వాత పరిస్థితిపై సమీక్ష చేపడుతున్నట్లు పెట్రోలియం శాఖ తెలుపుతోంది. దేశంలో ముడిచమురు నిల్వలు పెంచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

మరోవైపు హర్మూజ్ జలసంధి మూసేసినా భారత్ కు ఇంధన సరఫరా ఆగడం లేదు. ప్రస్తుతం 13 భారత నౌకలు ఉండగా.. అందులో 1 ఎల్పీజీ, 5 ఆయిల్ నౌకలున్నాయి. సంక్షోభం కొనసాగుతున్న ఇంధన నౌకల రవాణాకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఇరాన్ తో భారత్ సంప్రదింపులు జరుపుతుంది.

Read Also: ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్..!

Read Also: స్మార్ట్ ప్రెసిడెంట్స్​!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>