కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్మించనున్న ప్యూచర్ సిటీ (Future City) ఒక మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నిర్మాణానికి ప్రపంచస్థాయి సంస్థల నుంచి గ్లోబల్ టెండర్లను (Global Tenders) ఆహ్వానిస్తామన్నారు. ఏ ఒక్క కంపెనీకి కూడా నామినేటెడ్ పద్ధతుల్లో పనులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి పనులు జరిగినట్లు తేలితే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ప్రతీ పనికి గ్లోబల్ టెండర్ల విధానాన్నే ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా అనేక అంశాలను సీఎం వెల్లడించారు. ప్యూచర్ సిటీలో అర్బన్ ఫారెస్ట్రీ (Urban Forestry)లో భాగంగా మూడు వేల ఎకరాల్లో జూ పార్క్ (Zoo Park) కూడా ఉంటుందన్నారు.
వంతారా తరహా పార్కుకు ఆసక్తి :
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో వంతారాలో నిర్మించిన తరహాలోనే ప్యూచర్ సిటీలో సైతం ఒక జూ పార్కును నెలకొల్పడానికి అంబానీ గ్రూపు ఆసక్తి కనబర్చిందని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) సందర్భంగా వంతారా తరఫున ప్రతినిధులతో చర్చ జరిగాయని గుర్తుచేశారు. ఆ చర్చల ప్రకారం ఫ్యూచర్ సిటీలో జూ పార్కు నెలకొల్పడానికి ఇంట్రెస్టుగా ఉన్నారని అన్నారు. వస్తుందో.. రాదో… వారు డిసైడ్ చేసుకుంటారని అన్నారు. దీనితో పాటే క్రీడానగరం కూడా ఉంటుందన్నారు. స్పోర్టస్ ఏరీనా (Sports Arena)లో భాగంగా అన్ని రకాల ఆటలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం (Stadium)లు ఉంటాయన్నారు.
ఎయిర్‌పోర్టు కేంద్రంగా డెవలప్‌మెంట్ ప్లాన్ :
రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్ట్ సెంట్రిక్ గా అభివృద్ధి జరుగుతుందని సీఎం వివరించారు. ఫ్యూచర్ సిటీ(Future City) నిర్మాణంతోనే ఆ పరిసరాల్లో ఊహించనంత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫ్యూచర్ సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన ప్లానింగ్ ఉన్నదన్నారు. స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఏఐ (Artificial Intelligence) సెంటర్.. ఇలాంటివన్నీ ఉంటాయన్నారు. దేశ, విదేశీ కంపెనీలు యూనిట్లను నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నందున వారి రాకపోకలన్నీ ఎక్కువగా ఎయిర్ పోర్టు కేంద్రంగానే ఉంటాయన్నారు. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కి ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్‌పోర్టుకు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ భారీ స్థాయిలో డెవలప్ అవుతాయన్నారు.
Read Also: ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై సీఎం కామెంట్
Follow Us On: Pinterest


