epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజయ్​ దేవరకొండ మూవీ టైటిల్​ గ్లింప్స్​ 22న

కలం, వెబ్​డెస్క్​: విజయ్​ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్​ ఇండియా మూవీ (Vijay Deverakonda) ఎస్​వీసీ59 సినిమా టైటిల్​ గ్లింప్స్​ ఈ నెల 22న రిలీజ్​ చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్​లో దిల్​ రాజు, శిరీష్​ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్​ రవికిరణ్​ కోలా(Ravi Kiran Kola). ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో హీరో పాత్ర గురించి ఓ ప్రోమో నోట్​ను గురువారం డైరెక్టర్​ రిలీజ్​ చేశారు. ‘ ఒక మనిషి గురించి ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా.

నా జ్ఙాపకాల్లో అతను ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా. అతడిని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించాను. అతనిది అందరికీ చెప్పాల్సిన కథ. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను..’ అంటూ రిలీజ్​ చేసిన ఈ ప్రోమో నోట్​ ఆకట్టుకుంటోంది. రక్తం కారుతున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) చేయిని చూపిస్తూ ఈ ప్రోమోను ముగించడం ఆసక్తి కలిగిస్తోంది. సినిమా టైటిల్​ గ్లింప్స్​ను 22న రాత్రి సరిగ్గా 7.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు డైరెక్టర్​ రవి కిరణ్​ పేర్కొన్నారు. ఈ మూవీలో కీర్తి సురేశ్(Keerthy Suresh)​ హీరోయిన్​.

Read Also: నిధి అగర్వాల్ ఘటన.. లులు మాల్ పై కేసు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>