కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిన్న కూకట్ పల్లిలోని లులు మాల్ (LULU Mall) లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) తో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు లులు మాల్ మీద కేసు నమోదు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఈవెంట్ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: TFTDDA అధ్యక్షురాలిగా సుమలతా దేవి ప్రమాణ స్వీకారం
Follow Us On: Youtube


