epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గడువు ముగిసిన వెంటనే అమెరికాను వీడాలి: యూఎస్​ ఎంబసీ

కలం, వెబ్​డెస్క్​: విదేశీ పౌరులు గడువు ముగిసిన వెంటనే అమెరికాను వదిలి వెళ్లాలని ఇండియాలోని యూఎస్​ ఎంబసీ (US Embassy in India) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’​ వేదికగా కీలక పోస్ట్​ చేసింది. విదేశీయులు అమెరికాలో ప్రవేశించినప్పుడు యూఎస్​ కస్టమ్స్​ అండ్​ బోర్డర్​ ప్రొటెక్షన్​(సీబీపీ) అధికారులు ఐ–94 పత్రం జారీ చేస్తారు. ఇందులో ఎన్ని రోజులు ఉండాలని అనుమతి ఇస్తారో అదే అసలైన గడువు. ఇది ముగిసిన వెంటనే అమెరికాను వీడాలని యూఎస్​ ఎంబసీ పేర్కొంది. వీసా గడువు ప్రకారం అమెరికాలో ఉండడం కుదరదని స్పష్టం చేసింది. కాగా, ట్రంప్​ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్​ చట్టాలను కఠినతరం చేస్తున్న సమయంలో యూఎస్​ ఎంబీసీ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: ఒమన్​తో ఒప్పందం రెండు దేశాలకూ కొత్త శక్తి: ప్రధాని మోదీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>