కలం, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రేక్షకులను నెలల తరబడి అలరించిన బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. అక్కినేని నాగార్జున(Nagarjuna) హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలె డిసెంబర్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరగనుంది. స్టార్ మా ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కాగా, జియో హాట్‌స్టార్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఈ గ్రాండ్ ఫినాలెను మరింత గ్రాండ్‌గా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3, 4లో చిరంజీవి గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌లో తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, కల్యాణ్ పడాల టాప్5 ఫైనలిస్టులు మిగిలి ఉన్నారు. అయితే వీరిలో ఈసారి ఎవరు టైటిల్ గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే ఈనెల 21 వరకు వేచి చూడాల్సిందే.
Read Also: వాయిదా పడ్డ “సఃకుటుంబానాం” మూవీ రిలీజ్
Follow Us On: X(Twitter)


