కలం డెస్క్: ఐబొమ్మ రవి (iBomma Ravi) కస్టడీలో కీలక విషయాలను బయట పెట్టాడు. ఇన్ని రోజులు హెచ్ డీ సినిమా పైరసీ సీక్రెట్ గురించి నోరు విప్పలేదు. కానీ తాజాగా ఆ వివరాలు బయటపెట్టేశాడు. టెలీగ్రామ్ ఛానెల్ ద్వారా సినిమాలను పంపినట్టు తెలిపాడు ఐబొమ్మ రవి . శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి దాని ద్వారా హ్యాక్ చేసినట్టు బయటపెట్టాడు. క్యూబ్ నెట్ వర్క్(Cube Network) ను కూడా పైరసీ(Piracy) చేసినట్టు ఒప్పుకున్నాడు రవి. క్యూబ్ ద్వారానే సినిమాల డేటా మొత్తం ట్రాన్స్ ఫర్ చేసినట్టు స్పష్టం చేశాడు. ఏడు రోజులు పోలీసుల కస్టడీకీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. గతంలో రెండు సార్లు రవిని పోలీసులు విచారించారు. కానీ రవి(iBomma Ravi) నుంచి కీలక సమాచారం మొత్తం రాబట్టేందుకు పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు.
Read Also: 21న బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలె.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ?
Follow Us On: Instagram


