యువ సెయిలర్ ర‌మేజా భానును అభినందించిన సీతక్క

కలం, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రతిభ చాటుతున్న ‘రెయిన్ బో హెమ్స్’లో విద్యను అభ్య‌సిస్తున్న యువ సెయిలర్ ర‌మేజా భానును రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీత‌క్క‌ (Seethakka) అభినందించారు. ఈ మేరకు సచివాలయంలో ర‌మేజా భాను (Rameeza Bhanu) మంత్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. భ‌విష్య‌త్తులో భాను మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని సీతక్క ఆకాంక్షించారు. తెలంగాణ యువత అంతర్జాతీయ వేదికలపై దేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని అన్నారు. ర‌మేజా భాను వంటి ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొరాకోలో జరగనున్న పోటీల్లో ర‌మేజా భాను విజయంతో తిరిగి రావాలని కోరారు.

ఒమన్‌, సింగపూర్‌లలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సెయిలింగ్‌ కాంపిటీషన్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ర‌మేజా భాను.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విశిష్ట ప్రతిభ కనబరిచారు. వచ్చే వారం మొరాకోలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీల్లో మరోసారి భారతదేశం తరఫున పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసి ర‌మేజా భాను ఆశీర్వాదం తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>