కలం వెబ్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ రాకతో నిజమేదో, అబద్దమేదో అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టెక్నాలజీని మంచికి వాడుకోవాల్సిన యువత అనవసర విషయాలకు వినియోగిస్తూ లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మంచిర్యాల(Mancherial) జిల్లాలో చోటు చేసుకుంది. ఏఐ సాయంతో పులి(AI Tiger) సంచరిస్తున్న ఫోటో సృష్టించిన ఓ యువకుడు దాన్ని అంతటా ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ టౌన్ షిప్‌లో బుధవారం రాత్రి పులి సంచరిస్తుందంటూ సదరు యువకుడు ఫోటో(AI Tiger) వైరల్ చేశాడు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి వాస్తవాలు కనిపెట్టారు. యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేసి ఇతరులకు ఇబ్బందులకు కలిగించే చర్యలు చేపట్టవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Read Also: సర్పంచ్ సాబ్‌లు.. ఈ ‘గంగదేవిపల్లి’ మోడల్ గురించి మీకు తెలుసా?
Follow Us On: Pinterest


