కలం, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ సముద్ర తీరంలో సోలార్ ప్యానెల్‌తో కూడిన జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి (Seagull) కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత ఇది పక్షుల వలసలు, ఆహార అలవాట్లు అధ్యయనం కోసం చైనా శాస్త్రవేత్తలు అమర్చిన సైంటిఫిక్ డివైస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ సమీపంలోని థిమ్మక్క గార్డెన్ ప్రాంతంలో గాయపడిన స్థితిలో ఈ సముద్ర పక్షిని స్థానికులు గుర్తించారు. పక్షి వీపున సోలార్ ప్యానెల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ యూనిట్ ఉండటం గమనించిన వారు కోస్టల్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు స్పందించి పక్షిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ట్రాకర్‌పై ‘రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో-ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అనే మార్కింగ్స్ ఉన్నాయి. అలాగే పక్షి దొరికితే సంప్రదించాల్సిన ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. డివైస్ నుంచి డేటా తీసుకున్న అధికారులు ఈ పక్షి సుమారు 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని తెలిపారు.
ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ మాట్లాడుతూ.. పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇది పక్షుల వలసల అధ్యయనం కోసం అమర్చిన డివైస్‌గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. చైనా ఇన్‌స్టిట్యూట్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం పక్షిని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Read Also: H1b, H4.. ఏడాది ఎదురుచూడాల్సిందే!
Follow Us On: Sharechat


