Mobile Popup Ad
Mobile Popup Ad

మోదీ ప్రభుత్వానికి దూరదృష్టి లోపించింది : మల్లికార్జున ఖర్గే

కలం, వెబ్ డెస్క్ : ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ పరిస్థితిని బీజేపీ ప్రభుత్వమే సృష్టించిందని ఆయన ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకుంటే ధరలపై సబ్సిడీలిచ్చి ఉపశమనం కలిగించిందని గుర్తు చేశారు. కానీ, మోదీ (PM Modi) ప్రభుత్వం ధరలను తగ్గించే స్థాయికి తీసుకోచ్చారని విమర్శించారు. ఇంధన ధరల పెంపు వెనుక ఉన్న హేతుబద్ధత ఏంటని ఖర్గే ప్రశ్నించారు.

దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతోందనడానికి ఈ పరిస్థితులే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని దూషించడం తప్పా మోదీ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి దూరదృష్టి లోపిస్తే, పాలనపై అవగాహన లేకపోతే మన్మోహన్ సింగ్ పాలనను చూసి నేర్చుకోవాలని ఖర్గే (Mallikarjun Kharge) హితవు పలికారు.

Read Also: వ‌ర్చువ‌ల్‌ జంతు బ‌లితో బ‌క్రీద్ చేసుకోవాలంటున్న మంత్రి!

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>