Mobile Popup Ad
Mobile Popup Ad

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: ఎమ్మెల్యే వెంకటరావు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన పై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు (MLA Venkata Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి జరిగిన అవాంఛనీయ సంఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆసుపత్రిని సందర్శించి, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిన్న రాత్రి అసలు ఏం జరిగిందనే విషయమై అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న రోగులను, వారి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Venkata Rao) మాట్లాడుతూ.. భద్రాచలం ఏరియా ఆసుపత్రి కేవలం స్థానికులకే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది గిరిజన, పేద ప్రజలకు ప్రధాన ఆధారమని గుర్తుచేశారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ వైద్యశాలలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పొరపాట్లు లేదా అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతతో, అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని గానీ, బాధ్యతారాహిత్యాన్ని గానీ సహించేది లేదని స్పష్టం చేశారు.

​వైద్యుడిగా తనకు ఆసుపత్రుల నిర్వహణ, రోగుల ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందని, పేదలకు నమ్మకమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేతో పాటు ఆసుపత్రిని సందర్శించిన వారిలో ఏరియా హాస్పిటల్ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు ఉన్నారు.

Read Also: బొంతపల్లిలో ఎకో ఫారెస్ట్ పార్క్‌ ప్రారంభించిన మంత్రి సురేఖ

Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>