కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంకోర్టులో పిటిషన్

కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీపై (Cockroach Janata Party) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సోషల్ మీడియా హ్యాండిల్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలను ఇలా దుష్ప్రచారం చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని విన్నవించారు. న్యాయ వ్యవస్థలో ఫేక్ అడ్వకేట్లు నకిలీ డిగ్రీలతో కొనసాగుతున్నారన్న సీజేపీ ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ కేసు త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.

సీజేపీ అధ్యక్షుడికి బెదిరింపులు..

ఇన్ స్టాలో సీజేపీ (Cockroach Janata Party) పార్టీకి ఇప్పటివరకు 22 మిలియన్ల ఫాలోవర్లు రాగా.. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయించేందుకు భారీగా కుట్ర జరుగుతుందని దీనికి నాయకత్వం వహిస్తున్న అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) పేర్కొన్నారు. అంతేగాకుండా, తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Read Also: న‌న్ను ఆయ‌న చెప్పుతో కొట్టాడు.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన‌ బండ్ల గ‌ణేష్!

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>