కలం వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGA) పేరు మార్చడంపై విపక్షాలు ఆందోళన(Opposition Protests) కొనసాగిస్తున్నాయి. గురువారం ఉదయం ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఎదుట పలువురు ప్రముఖులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), విపక్ష ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం పేదల హక్కులను హరించడం ఆపాలంటూ నినాదాలు చేశారు.
Read Also: ప్రముఖ శిల్పి రామ్ సుతార్ కన్నుమూత
Follow Us On: Sharechat


