భారీ శుభవార్త.. జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ (Indiramma Life Insurance) పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కులమతాలకు అతీతంగా, పేద ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా రక్షణ కల్పించబోతున్నట్లు వివరించారు. అలాగే, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపుతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. లక్ష కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

Read Also: పీసీసీ చీఫ్ గురించి త‌ప్పుడు వార్త‌ల‌పై ద‌ర్యాప్తు చేస్తాం: ఎంపీ మ‌ల్లు ర‌వి

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>