కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. నిర్మాణరంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడుతుండటంతో ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంటోంది. గాలి కాలుష్యం తగ్గించడంలో భాగంగా కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటికే ‘పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే పెట్రోల్ పొయొద్దు’ నిబంధనను తీసుకొచ్చిన ప్రభుత్వం ఢిల్లీ రోడ్లపై పాత కార్లకు ఎంట్రీ లేదని తేల్చి చెప్పింది.
కాలుష్య నిరోధక చర్యల భాగంగా గురువారం దేశ రాజధానిలో పాత కార్లు అనుమతించబడవు. గుగా, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి ఢిల్లీకి వచ్చే 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. నోయిడా నుండి 4 లక్షల పైగా వాహనాలు, ఘజియాబాద్ నుండి 5.5 లక్షలు వాహనాలు నేషనల్ క్యాపిటల్‌లో ప్రవేశించడానికి అనుమతి (No Entry) లేదు. వాహన తనిఖీల కోసమే 580 పోలీస్ సిబ్బంది నియమించబడ్డారు. ఢిల్లీ(Delhi) ఇప్పటికే పెట్రోల్ పంప్స్‌లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇవి చెల్లిన పీయూసీ సర్టిఫికెట్‌లేని వాహనాలను గుర్తిస్తాయి.
Read Also: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు
Follow Us On: X(Twitter)


