కలం, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)కు చెందిన “లేడీ డాన్”గా పేరొందిన అరుణ (Don Aruna) వ్యవహరం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అరుణపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర హోం శాఖలో పనిచేస్తున్నట్టు నటించి, సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఫోన్లో బెదిరించింది. ఆమెకు రౌడీ షీటర్లతో సంబంధాలు కూడా ఉన్నాయి. అనేక భూ సెటిల్మెంట్లు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. అరుణ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం పీడీ యాక్ట్(PD Act) నమోదు చేసింది. కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు దోచుకుందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: నేటి నుంచి ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీ
Follow Us On: Youtube


