Mobile Popup Ad
Mobile Popup Ad

హరీశ్ రావుకు శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్:  మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో ఉండి హరీశ్‌రావు (Harish Rao) కలలు కంటున్నారని ఫైర్ అయ్యారు. ఇటీవల హరీశ్ రావు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు. భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) తెలంగాణ రాష్ట్రానికి ఇంజిన్ లాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. పెట్టుబడిదారులను బెదిరించేలా హరీశ్‌రావు వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు ఉన్నాయని శ్రీధర్ బాబు (Sridhar Babu) ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని పేర్కొన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల ప్రతినిధులను భయపెట్టేలా వ్యాఖ్యలు చేయడం అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేసినా, అనేక ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారిస్తున్న తరుణంలో ఇలాంటి విమర్శలు సరైనవి కావన్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

Read Also: ట్రంప్ ఆహ్వానం.. త్వరలోనే అమెరికాకు ప్రధాని మోదీ?

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>