కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోవడంతో విజేతల జాబితాను(Sarpanch Elections Report) లోక్‌భవన్‌కు (Lok Bhavan) రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గురువారం అందజేయనున్నది. ఎక్కడా రీ-పోలింగ్, రీ-కౌంటింగ్ పరిస్థితులు లేనందున అన్ని జిల్లాల్లోని పంచాయతీల నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో వచ్చే వివరాలను గవర్నర్‌కు అందజేయనున్నది. ఆమోదం తర్వాత గెజిట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీని ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, ఆ శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్ళి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన నిధుల గురించి వివరించి రిక్వెస్టు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇంకా పూర్తికానందున కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలయ్యే నిధుల్లో 15% మినహా మిగిలిన 85% ఫండ్స్ అందనున్నాయి.
Read Also: ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకంపై నిషేధం
Follow Us On : WhatsApp


