కలం, వెబ్ డెస్క్ : స్కూల్ ప్రిన్సిపల్ కొట్టడంతో ఇద్దరు స్టూడెంట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) పట్టణంలో జరిగింది. స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్ లో భగవంతరావు నగర్ కు చెందిన అయాన్, జయవరం గ్రామానికి చెందిన సాయి పదో తరగతి చదువుతున్నారు. అయితే మొన్న ఆదివారం స్పెషల్ క్లాస్ లు పెట్టారు. దీనికి అయాన్, సాయి రాలేదు. అయాన్ తన తల్లికి హెల్త్ బాగా లేకపోవడంతో ఇంటివద్దే 15 రోజులుగా ఉంటున్నాడు. అయాన్, సాయి సోమవారం స్కూల్ కు రావడంతో ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
స్పెషల్ క్లాస్ లకు ఎందుకు రాలేదంటే చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో సాయి చేయి, అయాన్ కు వేలు విరిగింది. ఈ విషయంపై స్థానికులు, పేరెంట్స్ ప్రిన్సిపల్ ను నిలదీశారు. విద్యార్థులను కొట్టడంపై వేములవాడ (Vemulawada) విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ గతంలో కూడా కొందరు విద్యార్థులను ఇలాగే కొట్టినట్టు తెలుస్తోంది.
Read Also: ఇది రాజ్యాంగ ఉల్లంఘన : స్పీకర్ నిర్ణయంపై హరీశ్ రావు ఫైర్
Follow Us On: Sharechat


