Mobile Popup Ad
Mobile Popup Ad

పన్ను ఎగవేతదారులపై CBDT సీరియస్

కలం, వెబ్ డెస్క్ : వ్యవసాయ భూములు లేకుండానే కొందరు వ్యక్తులు వ్యవసాయ ఆదాయం పేరుతో ఆదాయపు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసిన కేసులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌ (CBDT) గుర్తించింది. డేటా విశ్లేషణ ద్వారా మాత్రమే 310 కేసులు బయటపడ్డాయి. వీరిలో ప్రతి ఒక్కరూ రూ. 50 లక్షల నుంచి రూ. 400 కోట్ల వరకు వ్యవసాయ ఆదాయం పేరుతో మినహాయింపు క్లెయిమ్ చేశారు. కానీ, వారి పేర్లపై భూమి శూన్యంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఈ 310 కేసుల్లో ప్రభుత్వం కోల్పోయిన పన్ను మొత్తం సుమారు రూ. 2,038 కోట్లుగా అధికారులు తెలిపారు.

కొంతమంది భూమి అమ్మకాల ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్‌ను వ్యవసాయ ఆదాయంగా చూపించినట్లు CBDT విచారణలో తేలింది. మరికొందరు అప్రకటిత ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపించి బ్లాక్ మనీని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని కేసుల్లో వ్యవసాయ కార్యకలాపాలపై సరైన డాక్యుమెంటరీ ఆధారాలు లేవని,  భూమి పరిమాణానికి మించి భారీ ఆదాయం చూపించిన ఉదాహరణలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

పన్ను శాఖ SAKSHAM వ్యవస్థ ద్వారా అధిక వ్యవసాయ ఆదాయం చూపించిన రిటర్నులను విశ్లేషించింది. అవసరమైన చోట్ల పన్ను చెల్లింపుదారులను తమ రిటర్నులను సవరించుకోవాలని సూచిస్తోంది. ఈ డేటా అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 నుంచి 2023-24 వరకు దాఖలు చేసిన ఐటీ రిటర్నుల ఆధారంగా సేకరించబడింది. ఇకపై ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సాటిలైట్ మ్యాప్స్‌, డేటా అనలిటిక్స్‌ వంటి ఆధునిక టూల్స్‌ను మరింతగా ఉపయోగించనున్నట్లు అధికారులు వెల్లడించాయి. చిన్న రైతులపై చర్యలు తీసుకోవడం లక్ష్యం కాదని, పెద్ద మొత్తాల్లో తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న వారిపై మాత్రమే దృష్టి పెట్టినట్లు CBDT వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also: ఎవరెస్ట్ పై వందేమాతరం.. చరిత్ర సృష్టించిన BSF మహిళా బృందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>