ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఊరట

కలం, వెబ్ డెస్క్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కుని విజయవాడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న ఏపీ దేవాదాయ శాఖ సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి (Kalingiri Shanthi) కి ఊరట లభించింది. ఆమెకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది.

ఈ మేరకు తన కుమార్తె స్కూల్ అడ్మిషన్ కోసం తమిళనాడులోని ఊటీకి వెళ్లాల్సి ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేయాలని శాంతి దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారించింది. అయితే గతంలో ఆమె (Kalingiri Shanthi) దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించిన న్యాయస్థానం.. తాజాగా మాత్రం మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. తల్లిగా ఆమె బాధ్యతలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు.. ఆమెకు ఈ నెల 23వ తేదీ నుంచి 5 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఆమె విజయవాడ జైలు అధికారుల ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: నిజామాబాద్ కలెక్టర్ చొరవ.. ట్రాన్స్‌జెండర్లపై నిషేధం ఎత్తివేత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>