కలం, వెబ్ డెస్క్ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) వివరణ ఇచ్చారు. తాను బీఆర్ ఎస్(BRS) సభ్యత్వం రద్దు చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదని.. సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకా కౌంటర్ పిటిషన్ కు లిఖితపూర్వ వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. పార్టీ మారుతాను అని కూడా చెప్పలేదని వివరించారు. మరి ఆయన వివరణపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. నేడు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ కీలక తీర్పు ఇచ్చారు. వారు పార్టీ మారారు అని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవని తోసిపుచ్చారు.
Read Also: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది.. స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
Follow Us On: X(Twitter)


