Mobile Popup Ad
Mobile Popup Ad

వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ”నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అంటూ చంద్రబాబు అన్న రెండు మూడు రోజులకే మా నాన్న ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనుమానాస్పద పరిస్థితులలో కూలిపోయింది” అని జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, అధికారిక విచారణలు నిర్వహించాయి. అయినప్పటికీ జగన్ (YS Jagan) తాజా వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

Read Also: టీడీపీ ఇరు వర్గాల ఘర్షణ.. రాళ్లు, కర్రలతో దాడులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>